మళ్లీ మళ్లీ వచ్చే పున్నమిలా
నువ్వు నవ్వుతుంటే చాలు అలా
వెండి కొండ మీద చంద్రుడిలా
తొంగి తొంగి నన్ను చూడకలా
మనసారా రమ్మని నను పిలిచే స్వర్గమా
వరమిచ్చే దేవుడే వరుడయ్యే భాగ్యమా
ఇది నిజమా నేస్తమా
నువ్వే నా సొంతమా
ఎద చేరే తీరమా
ఇంకా ఈ దూరమా
మళ్లీ మళ్లీ వచ్చే పున్నమిలా
నువ్వు నవ్వుతుంటే చాలు అలా
కథలేన్నో చెప్పాలని
ఎగిసి పడే నా ఆశలు
నిన్ను చేరే ఘడియ కోసం
ఎదురు చూస్తున్నవి
కలలు కనే నా కళ్లతో
కలబడుతూ నీ చూపులు
విరహమంటే ఏమిటంటూ తేలుసుకోమన్నవి
ప్రేమించే గుండెల సవ్వడి
సిరి మువ్వల అడుగుల సందడి
ఎదలో మొదలై ఆ అలికిడి
వినమంటూ ఒకటే అల్లరి
చెవులుండే మనసుకి
అది కాదా బహుమతి
హ మళ్లీ మళ్లీ వచ్చే పున్నమిలా
నువ్వు నవ్వుతుంటే చాలు అలా
ప్రతి నిమిషం నీ ఊహలే
ఊపిరిగా ఉన్నా సరే
నిన్ను చూస్తే మాటరాదు
ఎందుకే నా చెలి
ఒంటరిగా ఉన్నానని
మనసు పడే నీ మాటలే
తలుచుకొంటే సిగ్గు ముంచే
ఏమిటీ ధోరణి
ఎన్నెన్నో జన్మలు వేచినా
ఇపుడే నీ సన్నిధి చేరినా
నీ కౌగిలిలోనే ఒదిగిన
నాలో ఏదో ఆవేదనా
చిగురించే ప్రేమకి అది నీలో స్పందన
మళ్లీ మళ్లీ వచ్చే పున్నమిలా
నువ్వు నవ్వుతుంటే చాలు అలా
వెండి కొండ మీద చంద్రుడిలా
తొంగి తొంగి నన్ను చూడకలా
మనసారా రమ్మని నను పిలిచే స్వర్గమా
వరమిచ్చే దేవుడే వరుడయ్యే భాగ్యమా
ఇది నిజమా నేస్తమా
నువ్వే నా సొంతమా
ఎద చేరే తీరమా
ఇంకా ఈ దూరమా