← Kembali
🎵

Nee Tholisariga

Album: Usha Durasi: 4:51
[00:31.29]నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా
[00:37.25]నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా
[00:42.79]స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవే ప్రియతమా
[00:48.34]మౌనమో మధుర గానమో తనది అడగవేం హృదయమా
[00:54.09]ఇంతలో చేరువై, అంతలో దూరమై అందవా స్నేహమా
[01:05.21]నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా
[01:10.96]నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా
[01:59.05]రెక్కలు తొడిగిన తలపు నువ్వే కాదా నేస్తమా
[02:04.67]ఎక్కడ వాలను చెప్పు నువ్వే సావాసమా
[02:10.52]హద్దులు చెరిపిన చెలిమి నువై నడిపే దీపమా
[02:15.96]వద్దకు రాకని ఆపకిలా అనురాగమా
[02:21.63]నడకలు నేర్పిన ఆశవు కదా
[02:24.53]తడబడనీయకు కదిలిన కథ
[02:27.34]వెతికే మనసుకు మమతే పంచుమా
[02:32.90]నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా
[02:38.61]నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా
[03:29.42]ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా
[03:35.02]అమ్రుతమనుకొని నమ్మటమే ఒక శాపమా
[03:40.73]నీ ఒడి చేరిన ప్రతి మదికి భాదే ఫలితమా
[03:46.30]తీయని రుచిగల కటిక విషం నువ్వే సుమా
[03:51.98]పెదవుల పై చిరు నవ్వుల దగ
[03:54.88]కనపడనీయవు నిప్పుల సెగ
[03:57.65]నీటికి ఆరని మంటల రూపమా
[04:03.20]నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా
[04:09.04]నీ బాటేమిటో ఏ జంటకి చూపవు కదా
[04:14.44]తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చలగాటమా
[04:20.17]చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా
[04:25.89]పేరులో ప్రణయమా, తీరులో ప్రళయమా
[04:31.68]పంతమా బంధమా
[04:37.11]నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా
[04:42.89]నీ బాటేమిటో ఏ జంటకి చూపవు కదా
[04:48.66]🎵